అస్సాం అధికారికి రూ.100 కోట్ల అక్రమాస్తులు

ప్రధానాంశాలు

Published : 26/08/2021 04:55 IST

అస్సాం అధికారికి రూ.100 కోట్ల అక్రమాస్తులు

ఈనాడు, గువాహటి: అస్సాంలోని దుబ్రి జిల్లా అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన అస్సాం సివిల్‌ సర్వీస్‌ అధికారి సాయిబర్‌ రహ్మాన్‌ ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక నిఘా విభాగం అధికారులు గుర్తించారు. ఆయనతోపాటు ఇద్దరు భార్యల పేర్లపై రూ.100 కోట్లకు పైగా విలువైన 89 ప్లాట్లు ఉన్నట్లు కనుగొన్నారు. దీంతోపాటు రహ్మాన్‌ రూ.6.38 కోట్ల స్థిర, చరాస్తులు కలిగి ఉన్నట్లు తేల్చారు. ఇందులో 95 శాతం అక్రమమేనని తేలింది.  2002 జూన్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్య అక్రమ మార్గంలో వీటిని కూడబెట్టినట్లు వెల్లడైంది. ఆయన్ను మంగళవారం అరెస్టు చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో రహ్మాన్‌ రెండో భార్య మీనాక్షి ఆలిండియా యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో ఆమె తన పేరిట రూ.8.5 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన