అమెరికాలో కొవిడ్‌ విజృంభణ

ప్రధానాంశాలు

Published : 29/08/2021 05:09 IST

అమెరికాలో కొవిడ్‌ విజృంభణ

విలవిలలాడుతున్న ఫ్లోరిడా

మియామి: అమెరికాలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో శుక్రవారం 1.90 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 1,300 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ప్రధానంగా ఫ్లోరిడాలో మరణాలు పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ఇక్కడ రోజువారీ మరణాల సగటు 52 కాగా.. గత వారం రోజులుగా సగటున రోజుకు 279 మరణాలు సంభవిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల నుంచి మృతదేహాల తరలింపు.. అంత్యక్రియల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్లోరిడాలో శుక్రవారం 27 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. కొందరు పిల్లలు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. 211 మంది పిల్లలు కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన