60 ఏళ్లు దాటినవారికి రెండో డోసు వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టండి

ప్రధానాంశాలు

Published : 05/09/2021 04:50 IST

60 ఏళ్లు దాటినవారికి రెండో డోసు వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టండి

 ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ-కశ్మీర్‌కు కేంద్రం స్పష్టీకరణ

దిల్లీ: అరవై ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్‌ టీకా రెండో డోసు వేసే కార్యక్రమంపై దృష్టి సారించాలని 8 ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్‌, జమ్మూ-కశ్మీర్‌లకు కేంద్రం శనివారం స్పష్టం చేసింది. ఈ వయసువారికి కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి టీకాలు వేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఈమేరకు ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అసంతృప్తికరంగా ఉందని పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌, జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ల ప్రతినిధులతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో 18 ఏళ్లు పైబడినవారికి తొలి డోసు వేసే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన