‘కొవిడ్‌’లోనూ బోధించారు

ప్రధానాంశాలు

Published : 05/09/2021 04:50 IST

‘కొవిడ్‌’లోనూ బోధించారు

ఉపాధ్యాయుల సేవలను కొనియాడిన రాష్ట్రపతి

దిల్లీ: కొవిడ్‌-19’తో తలెత్తిన లాక్‌డౌన్లలో ఉపాధ్యాయులు చూపిన చొరవ, విద్యార్థులకు నిరంతర విద్య అందించడానికి వారు చేసిన కృషిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో బోధనకు అంతరాయం కలగకుండా వారు తీసుకున్న చర్యలను ప్రస్తుతించారు. ‘‘భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం.. ఉపాధ్యాయులది. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ మాధ్యయాన్ని విద్యార్థులకు పరిచయం చేసి, తద్వారా విద్యను అందించడం అతి పెద్ద సవాల్‌. దాన్ని మన ఉపాధ్యాయులు అధిగమించారు. విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారు’’ అని రాష్ట్రపతి ప్రశంసించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన