అత్యంత ప్రభావవంతులు మోదీ, మమత, అధర్‌ పూనావాలా

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:16 IST

అత్యంత ప్రభావవంతులు మోదీ, మమత, అధర్‌ పూనావాలా

వంద మంది పేర్లతో జాబితాను ప్రకటించిన టైమ్‌ మ్యాగజీన్‌

న్యూయార్క్‌: ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావవంతుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అధర్‌ పూనావాలాలకు చోటు దక్కింది! 2021కు సంబంధించి ప్రఖ్యాత ‘టైమ్‌ మ్యాగజీన్‌’ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఏషియన్‌ పసిఫిక్‌ పాలసీ, ప్లానింగ్‌ కౌన్సిల్‌ కార్యనిర్వాహక డైరెక్టర్‌ పి.కులకర్ణిని కూడా ఈ జాబితాలో ప్రముఖంగా పేర్కొంది.

దేశ రాజకీయాలను శాసించిన మూడో నేత...

స్వతంత్ర భారత్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత మోదీలా మరెవరూ దేశ రాజకీయాలను శాసించలేదని టైమ్‌ మ్యాగజీన్‌ ప్రశంసించింది. అయితే- ‘‘దేశాన్ని ఆయన లౌకికవాదం నుంచి హిందూ జాతీయవాదం వైపు నెట్టారు. ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాశారు. జర్నలిస్టులను నిర్బంధించి, భయపెట్టారు’’ అంటూ మోదీపై వ్యాఖ్యానం రాసిన సీఎన్‌ఎన్‌ పాత్రికేయుడు ఫరీద్‌ జకారియా ఆరోపించారు.

భారత రాజకీయాల్లో ధీర వనిత...

మమత..భారత రాజకీయాల్లో ధీరవనితగా అవతరించారని ఆ మ్యాగజీన్‌ పేర్కొంది. వీధి పోరాట స్ఫూర్తి, పితృస్వామ్య వ్యవస్థలో తనంతట తానుగా నాయకురాలిగా ఎదగడం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని ప్రశంసించింది.

బైడెన్‌.. కమల.. ట్రంప్‌..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో పాటు.. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. టెన్నిస్‌ క్రీడాకారిణి నయోమి ఒసాకా, సంగీత స్రష్ట బ్రిట్నీ స్పియర్స్‌, ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తదితరుల పేర్లు కూడా అత్యంత ప్రభావవంతుల పేర్లు జాబితాలో ఉన్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన