దేశంలో మ్యూ తరహా కరోనా లేదు

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:16 IST

దేశంలో మ్యూ తరహా కరోనా లేదు

దిల్లీ: దేశంలో ‘డెల్టా’ రకం కరోనా వైరస్సే కొనసాగుతోందని, ‘మ్యూ’, ‘సి.1.2’ తరహా వేరియంట్లుగా ఇంకా మార్పు చెందలేదని నిపుణులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ మహమ్మారి సి.1.2. తరహాగా మార్పు చెందిందని, భారత్‌లో మాత్రం ఆ పరిస్థితి రాలేదని ‘ఇన్సాకాగ్‌’ అనే సంస్థ తెలిపింది. ఇక్కడ డెల్టా రకం, దాంట్లో కొద్దిగా మార్పులు చెందిన రకాలే ఉన్నాయని పేర్కొంది. ‘మ్యూ’ రకం వస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరగాల్సి ఉంటుందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ‘మ్యూ’ రకం వైరస్‌ తగ్గుతోంది. కొలంబియాలో 39 శాతం, ఈక్విడార్‌లో 13 శాతం మేర మాత్రమే ఉంది. మార్పులు చెందుతున్న కరోనా వైరస్‌కు నిపుణులు గ్రీకు వర్ణమాల పేర్లు పెడుతున్నారు. అ, ఆ, ఇ, ఈలు మాదిరిగా అవి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని ఉంటాయి. మ్యూ కూడా ఇందులోనిదే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన