9 విదేశీ ఎన్‌జీవోలపై కేంద్రం ఆంక్షలు

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:39 IST

9 విదేశీ ఎన్‌జీవోలపై కేంద్రం ఆంక్షలు

ముందస్తు అనుమతి లేకుండా నిధులు తీసుకురావొద్దని ఆదేశం

దిల్లీ: భారత్‌కు నిధులు తీసుకొచ్చే విషయంలో విదేశాలకు చెందిన 9 స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జీవో)లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా సొమ్ము బదిలీలు చేపట్టకూడదని ఆదేశించింది. ఈ మేరకు వాటిని విదేశీ విరాళాల నియంత్రణ చట్టం-2010 నిబంధనల ప్రకారం ‘ప్రియర్‌ రిఫరెన్స్‌ కేటగిరీ’లో ఉంచింది. ఈ కేటగిరిలోని సంస్థల నుంచి ఎలాంటి నిధులు జమ అయినా.. బ్యాంకులు సంబంధిత సమాచారాన్ని అధికారులకు చేరవేయాల్సి ఉంటుంది. తాజాగా ఆంక్షలకు గురైన ఎన్‌జీవోల్లో అమెరికాకు చెందినవి మూడు, ఆస్ట్రేలియా సంస్థలు రెండు, బ్రిటన్‌ సంస్థలు నాలుగు ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన