సహజ కాన్పుల్లో వైరస్‌ వ్యాప్తి ముప్పు ఎక్కువే

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:39 IST

సహజ కాన్పుల్లో వైరస్‌ వ్యాప్తి ముప్పు ఎక్కువే

వాషింగ్టన్‌: సహజ కాన్పులు జరిపించే సమయంలో వైద్యులు, ఇతర సిబ్బంది కరోనా వంటి శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. ప్రసవం చేయించేటప్పుడు వారు ఎన్‌-95 మాస్కులు, పీపీఈ కిట్లు ధరించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. సాధారణంగా కొన్నిరకాల వైద్య ప్రక్రియల్లో వైద్య సిబ్బంది కొవిడ్‌, శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సహజ కాన్పులను ఇప్పటివరకు అలాంటి ‘హైరిస్క్‌ విభాగం’లో చేర్చలేదు. వాటిని జరిపించేటప్పుడు ఎన్‌-95 మాస్కుల వంటివి తప్పనిసరిగా ధరించాలని సిఫార్సులూ చేయలేదు. అయితే పురుటి నొప్పుల సమయంలో మహిళలు అధికంగా శ్వాస తీసుకొని వదులుతుంటారని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. ఆ సమయంలో వారి నుంచి వెలువడే తుంపర్లు.. సాధారణ వ్యక్తి దగ్గినప్పటితో పోలిస్తే ఎక్కువ దూరం, అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. గర్భిణులకు కరోనా, శ్వాస సంబంధిత వ్యాధులు ఉంటే.. ఆ సమయంలో వైద్య సిబ్బందికి సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన