ప్రజా ప్రయోజన కోణంలోనే ఆస్థానా నియామకం: కేంద్రం

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:22 IST

ప్రజా ప్రయోజన కోణంలోనే ఆస్థానా నియామకం: కేంద్రం

దిల్లీ: గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి రాకేశ్‌ ఆస్థానాను దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమించటం ప్రజాప్రయోజన కోణంలో తీసుకున్న నిర్ణయమే అని కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, పారా-మిలటరీ బలగాలను సమన్వయం చేసుకునేందుకు సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారి నియామకం తప్పనిసరి అవసరంగా భావించినట్లు పేర్కొంది. విధి నిర్వహణలో ఆస్థానా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకునే ఆయన సర్వీసును కూడా పొడిగించినట్లు సమర్థించుకుంది. ఈ మేరకు కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ నియామకంలో ఎటువంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేశారు. పదవీ విరమణకు కేవలం కొద్దిరోజుల ముందు రాకేశ్‌ ఆస్థానా సర్వీసును పొడిగించి, దిల్లీ సీపీగా ఆయన్ను నియమిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలంటూ దాఖలైన పిల్‌పై ఈ విచారణ సాగుతోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన