దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:57 IST

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు

జెనీవా: కరోనా మహమ్మారితో గత రెండేళ్లుగా ఆటంకాలు ఎదురైన నేపథ్యంలో.. వార్షిక సదస్సును వచ్చే ఏడాది జనవరి 17-22 తేదీల మధ్య దావోస్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నట్లు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) గురువారం వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలోనూ వర్చువల్‌ సమావేశమే జరిగిన విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజంపై కరోనా చూపిన ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని 2022 సదస్సును ‘కలిసి పనిచేద్దాం.. విశ్వాసం పునరుద్ధరిద్దాం’ అనే నినాదంతో చేపట్టనున్నట్లు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన