‘అగ్ని-5’పై చైనా అక్కసు!

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:57 IST

‘అగ్ని-5’పై చైనా అక్కసు!

బీజింగ్‌: అణ్వస్త్ర సామర్థ్యమున్న అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని త్వరలో పరీక్షించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చైనా గురువారం దీనిపై తన అక్కసు వెళ్లగక్కింది. దక్షిణాసియాలో శాంతి భద్రతల కోసం ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు కృషి చేయాలని పేర్కొంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం అగ్ని-5కి ఉంది. చైనాలోని అనేక నగరాలు ఈ అస్త్రం పరిధిలోకి వస్తాయి. ‘‘అణ్వస్త్రాలను మోసుకెళ్లగల బాలిస్టిక్‌ క్షిపణులను భారత్‌ అభివృద్ధి చేయవచ్చా అన్నదానిపై ఐరాస భద్రతా మండలి 1172 తీర్మానం స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిచ్కీజిజియాన్‌ వ్యాఖ్యానించారు. 1998లో భారత్‌, పాకిస్థాన్‌లు నిర్వహించిన అణు పరీక్షలను ఖండిస్తూ మండలి ఆ తీర్మానాన్ని చేసింది. తదుపరి అణు పరీక్షలు, అణ్వస్త్ర సామర్థ్య క్షిపణుల అభివృద్ధిని నిలిపివేయాలని రెండు దేశాలను కోరింది. భారత్‌-పసిఫిక్‌ ప్రాంత రక్షణ కోసం చైనా, అమెరికా, బ్రిటన్‌ కలిసి ఆకస్‌ (ఏయూకేయూఎస్‌) పేరుతో ఏర్పాటు చేస్తున్న త్రైపాక్షిక కూటమిని నిశితంగా గమనిస్తామని లిజియాన్‌ పేర్కొన్నారు. ఆ మూడు దేశాల నిర్ణయం వల్ల ప్రాంతీయ సుస్థిరత దెబ్బతింటుందని, ఆయుధ పోటీకి దారితీస్తుందని విమర్శించారు. అణ్వాయుధాలు దిగుమతి చేసుకునేలా ఆస్ట్రేలియాకు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన