తప్పించుకున్న మావోయిస్టు కీలక నేత సురేష్‌

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:57 IST

తప్పించుకున్న మావోయిస్టు కీలక నేత సురేష్‌

భువనేశ్వర్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టు కీలక నేత సురేష్‌ సూరన పోలీసులకు చిక్కకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. ఒడిశాలోని బాదిలీ హిల్స్‌ ప్రాంతంలో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బుధవారం అక్కడికి వెళ్లారు. వారిని చూసిన వెంటనే మావోయిస్టులు కాల్పులు జరిపారని మల్కాన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్‌ మీనా గురువారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారని తెలిపారు. ఇరువర్గాల మధ్య దాదాపు రెండు గంటల పాటు కాల్పులు కొనసాగాయని చెప్పారు. సురేష్‌ సూరన తన సహచరులతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడని పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన