30 వేలు దాటిన కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:57 IST

30 వేలు దాటిన కొవిడ్‌ కేసులు

24 గంటల్లో 431 మంది మృతి

దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య గురువారం మళ్లీ 30 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 30,570 మంది వైరస్‌ బారిన పడగా.. 431 మంది కొవిడ్‌తో మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కి పెరగ్గా.. మహమ్మారి బారిన పడి ఇంతవరకు 4,43,928 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 38,303 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. క్రియాశీలక కేసుల సంఖ్య 3,42,923 (1.03%)కి తగ్గింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన