ఇళ్ల స్థలాల కేటాయింపుపై విధానం రూపొందించండి

ప్రధానాంశాలు

Published : 17/09/2021 05:03 IST

ఇళ్ల స్థలాల కేటాయింపుపై విధానం రూపొందించండి

గుజరాత్‌ సర్కారుకు సుప్రీం ఆదేశం

దిల్లీ: రాయితీ ధరలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై ఒక విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు గురువారం గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, న్యాయమూర్తులకు స్థలాల కేటాయింపుపై విధానమో, మార్గదర్శకాలో ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. లాభాపేక్ష లేని సందర్భాల్లో స్థలాన్ని విక్రయించడానికి వీలు కలిగించాలంటూ ఓ ఎమ్మెల్యే దాఖలు చేసిన వినతిని పరిశీలించిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. అసలు కేటాయింపుల విషయమై విధానం ఉండాలని అభిప్రాయపడింది. గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన