నేటి నుంచి ప్రధాని బహుమతుల ఈ-వేలం

ప్రధానాంశాలు

Published : 17/09/2021 05:03 IST

నేటి నుంచి ప్రధాని బహుమతుల ఈ-వేలం

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ

దిల్లీ: వివిధ పర్యటనలు, సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుమతులుగా అందిన వస్తువులను కేంద్ర సాంస్కృతిక శాఖ నేటి నుంచి ఆన్‌లైన్‌లో వేలం వేయనుంది. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల దుస్తులు, పరికరాలు, అయోధ్య రామాలయం నమూనా తదితర వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు శుక్రవారం (సెప్టెంబరు 17) నుంచి వచ్చే నెల (అక్టోబరు) ఏడో తేదీ వరకు pmmementos.gov.inలో ఈ-వేలంలో పాల్గొనవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులను, జ్ఞాపికలను సాంస్కృతిక శాఖ వేలం వేయనుంది. వీటిలో చార్‌ధామ్‌, రుద్రాక్ష సమావేశ కేంద్రం నమూనాలు, శిల్పాలు, చిత్రాలు, అంగవస్త్రాలు మొదలైనవి ఉన్నాయి’’ అని గురువారమిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చిస్తారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన