ఎన్‌సీసీ సంస్కరణల కమిటీలో ధోనీ, ఆనంద్‌ మహీంద్ర

ప్రధానాంశాలు

Published : 17/09/2021 05:03 IST

ఎన్‌సీసీ సంస్కరణల కమిటీలో ధోనీ, ఆనంద్‌ మహీంద్ర

దిల్లీ: విద్యార్థుల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వాన్ని పెంపొందించడంతో పాటు వారిని నిస్వార్థ సేవాపరులుగా తీర్చిదిద్దే నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌(ఎన్‌సీసీ)లో తీసుకురాదలచిన మార్పులపై రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యులుండే ఈ కమిటీకి ఎంపికైన వారిలో భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఎం.ఎస్‌.ధోనీ, పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ఉన్నారు. మాజీ ఎంపీ బైజయంత్‌ పాండా నేతృత్వం వహించే ఈ కమిటీలో కర్నల్‌ (రిటైర్డ్‌) రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌, రాజ్యసభ ఎంపీ వినయ్‌ సహస్రబుద్ధే తదితరులనూ రక్షణ శాఖ నియమించింది. ఎన్‌సీసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీసుకురాదలచిన మార్పులపై నిపుణుల కమిటీ సమగ్ర సమీక్ష నిర్వహిస్తుంది. తగు సూచనలు చేస్తుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన