జామ్‌తో అందిన ప్రగతి

ప్రధానాంశాలు

Published : 17/09/2021 05:04 IST

జామ్‌తో అందిన ప్రగతి

మంత్రి నిర్మల

ఔరంగాబాద్‌: మూడు సౌకర్యాల సమాహారమైన ‘జామ్‌’ ద్వారా మారుమూలలో ఉన్న ప్రజలకు కూడా ప్రగతి ఫలాలు అందాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. జన్‌ధన్‌ యోజన-ఆధార్‌- మొబైల్‌ (జేఏఎం-జామ్‌) ద్వారా కరోనా సమయంలో ఎన్నో విధాలుగా సేవలు అందించామని చెప్పారు. గురువారం ఇక్కడ రాష్ట్రీయ బ్యాంక్‌ పరిషత్‌ నిర్వహించిన ‘మంథన్‌’ సదస్సును ఆమె వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధి కలిగించామని తెలిపారు. ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాను ప్రారంభించేలా విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన