భారత్‌ బయోటెక్‌కు లిమ్కా బుక్‌ ప్రశంసలు

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 04:57 IST

భారత్‌ బయోటెక్‌కు లిమ్కా బుక్‌ ప్రశంసలు

కొవిడ్‌ యోధులు, ఆవిష్కర్తలను గౌరవిస్తూ ప్రత్యేక సంచిక

దిల్లీ: ముందుండి కరోనాపై పోరాడిన యోధులను, ఆవిష్కర్తలను గౌరవిస్తూ... ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రత్యేక సంచిక తీసుకొచ్చింది. మానవ ప్రయత్నాలు, నిర్మాణాలతో పాటు... విద్య, రక్షణ, శాస్త్ర-సాంకేతిక, సాహస, వ్యాపార, సినీ, ప్రకృతి ప్రపంచ, సాహిత్య రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను గుదిగుచ్చుతూ రూపొందించిన 2020-22 సంయుక్త ఎడిషన్‌ను సోమవారం ఆవిష్కరించింది. దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌... భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)తో కలిసి కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిందని ప్రశంసించింది. విదేశాల్లోని భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ‘వందే భారత్‌ మిషన్‌’ను ప్రస్తావించింది. నిఖిల్‌ కురెలె, హర్షిత్‌ రాఠోడ్‌లు కొవిడ్‌ బాధితుల కోసం తక్కువ ధరలోనే తమ అంకుర సంస్థ నోకార్క్‌ రోబోటిక్స్‌ ద్వారా వెంటిలేటర్లు అందుబాటులోకి తెచ్చారని వివరించింది. పర్యావరణ అనుకూల కార్యక్రమాల్లో భారతీయ హరిత యోధులు సాధించిన విజయాలను కూడా ప్రత్యేక సంచికలో నమోదు చేసినట్టు ఈ పుస్తక ప్రచురణ సంస్థ హషట్‌ ఇండియా ఎండీ థామస్‌ అబ్రహాం తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో మైలురాళ్లుగా నిలిచిన 30 రికార్డులను కూడా ఇందులో ఫీచర్లుగా అందించినట్టు వెల్లడించారు. భారతీయులు దేశ, విదేశాల్లో సాధించిన విజయాలను గుర్తిస్తూ లిమ్కా సంస్థ 1990 నుంచి వారి ‘రికార్డ్స్‌’ను పుస్తక రూపంలో తీసుకొస్తోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన