కెనడాలో ట్రూడో హ్యాట్రిక్‌ విజయం!

ప్రధానాంశాలు

Published : 22/09/2021 05:20 IST

కెనడాలో ట్రూడో హ్యాట్రిక్‌ విజయం!

17 మంది ఇండో-కెనడియన్ల గెలుపు

టోరాంటో: కెనడాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మరోసారి లిబరల్‌ పార్టీకే ఓటర్లు పట్టం కట్టారు. ఫలితంగా జస్టిన్‌ ట్రూడో (49) మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. మెజారిటీ స్థానాలకు అల్లంత  దూరంలో నిలిచినప్పటికీ మిత్రపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాపై ఎక్కువగా దృష్టి పెడితే ఓటర్లను ఆకట్టుకోవచ్చనే ట్రూడో అంచనాలు తప్పాయి. ఇతర నాయకులతో పోల్చితే ఈ మహమ్మారిని తన ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొన్న తీరు ఓట్లవర్షం కురిపిస్తుందని ఆయన ఆశించగా.. అది అనవసరమైన అంశంగా కెనడియన్లు భావించారు. ఫలితంగా సోమ, మంగళవారాల్లో వెలువడిన ఫలితాల్లో మైనారిటీ సర్కారు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థానాలను ఓటర్లు ట్రూడో పార్టీకి కట్టబెట్టారు. ఎన్డీపీ నేత జగ్మీత్‌సింగ్‌, రక్షణమంత్రి హర్జీత్‌ సజ్జన్‌ సహా 17 మంది ఇండో-కెనడియన్లు ఈ ఎన్నికల్లో విజయం సాధించటం విశేషం. మొత్తానికి రెండేళ్ల కిందట జరిగిన 2019 నాటి ఎన్నికల ఫలితాలే దాదాపుగా పునరావృతం అయ్యాయి. లిబరల్‌ పార్టీ 158 స్థానాలు సాధించింది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మెజారిటీకి ఇంకా 12 స్థానాలు అవసరం. విపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ 119 స్థానాలు గెలిచింది. తాజా ఫలితాలపై స్పందించిన ట్రూడో.. దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కెనడాను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన