ఖడ్గమృగాల కొమ్ముల మంటల్లో అపోహల దహనం

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:37 IST

ఖడ్గమృగాల కొమ్ముల మంటల్లో అపోహల దహనం

అస్సాం ప్రభుత్వ వినూత్న చర్య

బొకాఖాట్‌: ఖడ్గమృగాల కొమ్ములు అద్భుత ఔషధ గుణాలను కలిగి ఉంటాయంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న అపోహను తొలగించేందుకుగాను అస్సాం ప్రభుత్వం వినూత్న చర్య చేపట్టింది. ఖడ్గమృగాలకు చెందిన 2,479 కొమ్ములను బహిరంగంగా దహనం చేసింది. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని పురస్కరించుకొని బొకాఖాట్‌ పట్టణంలో బుధవారం నిర్వహించిన ఈ దహన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు అస్సాం ప్రసిద్ధి. రాష్ట్రంలోని కజిరంగా సహా వివిధ జాతీయ పార్కుల్లో అవి 2,600 వరకూ ఉన్నట్లు అంచనా. అయితే వాటి కొమ్ముల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయన్న అపోహ.. వేటకు కారణమవుతోంది. దాన్ని తొలగించేందుకుగాను.. ఇన్నాళ్లూ సహజంగా/ప్రమాదాల్లో మరణించిన ఖడ్గమృగాల నుంచి సేకరించిన, వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న కొమ్ములను ప్రభుత్వం దహనం చేసింది. ఇకపై ఏటా ఈ దహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సీఎం నియంత్రించలేకపోవడంతో.. కాలిపోయిన డ్రోన్‌

ఖడ్గమృగాల కొమ్ముల దహనం కోసం అస్సాం ప్రభుత్వం బహిరంగంగా ప్రత్యేక ఛాంబర్‌ను రూపొందించింది. అందులో మంటను రగిలించేందుకుగాను లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్‌ (క్వాడ్‌కాప్టర్‌)ను దిల్లీ నుంచి తెప్పించింది. సీఎం హిమంత సరిగా నియంత్రించలేకపోవడంతో అది బుధవారం మంటల్లో పడి కాలిపోయింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన