2,318కి చేరిన డెంగీ కేసులు

ప్రధానాంశాలు

Updated : 28/09/2021 05:30 IST

2,318కి చేరిన డెంగీ కేసులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది కంటే ఈ సంవత్సరం డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1నుంచి ఈ నెల 26వ తేదీ వరకు 2,318 డెంగీ కేసులు వచ్చాయి. కిందటేడాది జనవరి నుంచి డిసెంబరు వరకు 2,027 కేసులు రికార్డయ్యాయి. ఇదే సమయానికైతే. 513(38వ వారం) కేసులు వచ్చాయి. ఈ నెల 20 నుంచి 26వ తేదీ మధ్య 225 కేసులు రికార్డయ్యాయి. వీటిల్లో అత్యధికంగా విశాఖ జిల్లాలో 56, తూర్పు గోదావరిలో 53, గుంటూరు జిల్లాలో41 చొప్పున నమోదయ్యాయి. ఇదే సమయంలో 18 మలేరియా కేసులు రాగా..విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోనే 13 రికార్డయ్యాయి. చికెన్‌గున్యా కేసులు 33 నమోదయ్యాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన