తమిళనాడులో స్థానిక ఎన్నికల గడువు పెంపు

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:41 IST

తమిళనాడులో స్థానిక ఎన్నికల గడువు పెంపు

 మరో నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు

దిల్లీ: తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయడానికి సోమవారం సుప్రీంకోర్టు మరో 4 నెలల గడువు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. సెప్టెంబరు 15లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని తొలుత జూన్‌ 22న ఆదేశాలు ఇవ్వగా గడువు పొడిగించాలని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. నాలుగు జిల్లాలను విభజించి కొత్తగా తొమ్మిది జిల్లాలు ఏర్పాటు చేశారని, దాంతో అదనంగా ఆరు కార్పొరేషన్లు, 28 పురపాలక సంఘాలు ఏర్పాటయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ చెప్పారు. అందువల్ల తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు గడువు పెంచాలని కోరారు. ‘‘చాలా చిన్న కారణాలు అయినప్పటికీ గడువు పెంచుతున్నాం. మరో నాలుగు నెలల సమయం ఇస్తున్నాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన