ప్రభుత్వ సాయం పొందడం హక్కేమీ కాదు

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:49 IST

ప్రభుత్వ సాయం పొందడం హక్కేమీ కాదు

దిల్లీ: ప్రభుత్వ సహాయం పొందడం ప్రాథమిక హక్కేమీ కాదని సోమవారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు సాయం చేసే విషయంలో ప్రభుత్వం ఆర్థిక స్థోమత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విషయానికి వస్తే వాటిలో మైనార్టీ, మైనార్టీయేతర అన్న తేడా ఉండదని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. విధానపర నిర్ణయంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని నిలిపివేసినప్పుడు దాన్ని ప్రశ్నించలేవని పేర్కొంది. అదే ఒక సంస్థకు ఇచ్చి, మరో సంస్థకు నిలిపివేసినప్పుడు మాత్రం అడిగే అవకాశం ఉందని తెలిపింది. నిబంధనలు పాటించినప్పుడే సహాయం పొందడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. ఎయిడెడ్‌ కళాశాలల విషయమై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పుచెప్పింది. దానిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలు సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్య చేసింది. మరీ నిరంకుశంగా ఉంటే తప్ప విధానపర నిర్ణయాలను తప్పుపట్టలేమని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన