3 హైకోర్టులకు ఏడుగురు జడ్జీల నియామకం

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:48 IST

3 హైకోర్టులకు ఏడుగురు జడ్జీల నియామకం

కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

ఈనాడు, దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజీయం చేసిన సిఫార్సుల మేరకు పట్నా, అలహాబాద్‌, బాంబే హైకోర్టులకు ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాదులుగా ఉన్న నలుగురిని పట్నా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. న్యాయాధికారుల్లో ఒకరిని అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, మరో ఇద్దరిని బొంబాయి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. తాజా నియామకాలతో కలిపి గత నాలుగు రోజుల్లో 43 మందిని జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లయింది. బుధవారం మూడు హైకోర్టులకు 14 మందిని జడ్జీలుగా నియమించిన విషయం తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన