హిందూ ఆలయాలపై దాడి.. బంగ్లాదేశ్‌లో నలుగురి మృతి

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:48 IST

హిందూ ఆలయాలపై దాడి.. బంగ్లాదేశ్‌లో నలుగురి మృతి

ఢాకా, దిల్లీ: దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. కొంతమంది గుర్తు తెలియని ఛాందసవాదులు హిందూ ఆలయాలపై జరిపిన దాడులు ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీసు కాల్పుల్లో నలుగురు చనిపోగా అనేకమంది గాయపడ్డారు. దుర్గాపూజ మండపాల్లో దైవ దూషణతో మొదలైన ఉద్రిక్తత ఆ తర్వాత మందిరాలపై దాడికి దారి తీసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియోలతో ఉద్రిక్తత పెరిగింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన