భారత్‌తో 30 దేశాల అవగాహన

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:48 IST

భారత్‌తో 30 దేశాల అవగాహన

కొవిడ్‌ టీకా ధ్రువపత్రాలను అంగీకరించేందుకు ఒప్పందం

దిల్లీ: కొవిడ్‌-19 టీకా ధ్రువపత్రాలను పరస్పరం అంగీకరించుకోవాలని భారత్‌తో సుమారు 30 దేశాలు ఒప్పందం చేసుకున్నట్టు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ దేశాల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నేపాల్‌, బెలారస్‌, లెబనాన్‌, అర్మేనియా, ఉక్రెయిన్‌, బెల్జియం, హంగేరి, సెర్బియాలు ఉన్నట్టు తెలిపాయి. అయితే... దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, చైనా, ఐరోపాలోని మరికొన్ని దేశాల నుంచి వచ్చేవారు భారత్‌కు చేరుకున్న తర్వాత కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం వంటి మరికొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన