దక్షిణ తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:05 IST

దక్షిణ తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం

46 మంది మృతి

తైపీ: దక్షిణ తైవాన్‌లోని కావోసియింగ్‌ నగరంలో 13 అంతస్తుల వాణిజ్య, నివాస భవన సముదాయంలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 46 మంది చనిపోయారు. 41 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో  కింది అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. అనంతరం మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ముందు 32 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తర్వాత మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ భవనంలో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కింది అంతస్తుల్లో దుకాణాలు ఉన్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన