దిల్లీలో ఛట్‌ పూజలకు అనుమతివ్వండి

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:35 IST

దిల్లీలో ఛట్‌ పూజలకు అనుమతివ్వండి

ఎల్జేను కోరిన కేజ్రీవాల్‌

దిల్లీ: కొవిడ్‌ పరిస్థితులు అదుపులోనే ఉన్నందున దిల్లీలో ఛట్‌ పూజలకు అనుమతులిచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జే) అనిల్‌ బైజాల్‌ను కోరారు. ఇందుకోసం తక్షణమే దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ ముప్పును దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాల్లో ఛట్‌ పూజలు నిర్వహించకుండా డీడీఎంఏ గత నెల 30న నిషేధం విధించింది. దీనిపై కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మనోభావాలను కేజ్రీవాల్‌ ప్రభుత్వం దెబ్బతీస్తోందంటూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం.. గురువారం ఎల్జేకు లేఖ రాశారు. డీడీఎంఏకు ఛైర్మన్‌గా లెఫ్టినెంట్‌ గవర్నర్‌, వైస్‌ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన