మన భూభాగాల నుంచి చైనాను ఎప్పుడు గెంటేస్తారు?

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:35 IST

మన భూభాగాల నుంచి చైనాను ఎప్పుడు గెంటేస్తారు?

అమిత్‌ షాను ప్రశ్నించిన కాంగ్రెస్‌

దిల్లీ: మన దేశ భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చిన చైనాను ఎప్పటిలోగా వెనక్కి పంపించివేస్తారో తెలపాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. గొప్పలు చెప్పుకోవడంతో సరిపుచ్చకుండా మన దేశానికి అంతర్గత, బాహ్య శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించడంపై దృష్టిసారించాలని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా సూచించారు. అయిదేళ్ల క్రితం పాకిస్థాన్‌ భూభాగాలపై జరిపిన మెరుపు దాడులతో మన సరిహద్దుల్లో జోక్యంచేసుకొనే వారికి గట్టి హెచ్చరిక చేసినట్లయ్యిందని గురువారం పణజీలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. చైనా పేరు పలకటానికే మోదీ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. చైనా సైనికులు దాదాపు 900 కి.మీ.మేర భారత భూగాలను అక్రమంగా ఆక్రమించారని, వారిని ఖాళీ చేయించడానికి తుది గడువును ప్రకటించాలని అమిత్‌ షాను సుర్జేవాలా కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన