ఐరాస మానవ హక్కుల మండలికి భారత్‌ మరోసారి ఎన్నిక

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:35 IST

ఐరాస మానవ హక్కుల మండలికి భారత్‌ మరోసారి ఎన్నిక

ఐరాస: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లోని 18 కొత్త సభ్యుల కోసం గురువారం నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఐరాస సర్వప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 2022 జనవరి నుంచి 2024 డిసెంబరు ఆఖరు వరకు మూడేళ్ల పాటు ఈ మండలిలో సభ్యత్వాన్ని భారత్‌ కలిగి ఉంటుంది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి భారత్‌ ఎన్నిక కావడం ఇది ఆరోసారి. మొత్తం 47 మంది సభ్యులు దీనిలో ఉంటారు. భారత్‌ ప్రస్తుత సభ్యత్వ పదవీ కాలం ఆ ఏడాది డిసెంబరు 31తో ముగియనుంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి భారత్‌తో పాటు కజక్‌స్థాన్‌, మలేసియా, కతర్‌, యూఏఈ సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన