కశ్మీర్‌లో స్థానికేతరులపై ఆగని ఉగ్రదాడులు

ప్రధానాంశాలు

Updated : 18/10/2021 10:12 IST

కశ్మీర్‌లో స్థానికేతరులపై ఆగని ఉగ్రదాడులు

మరో ఇద్దరు వలస కూలీల కాల్చివేత

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రవాదుల దమనకాండ కొనసాగుతూనే ఉంది. శనివారం బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వీధి వ్యాపారి, వడ్రంగిని బలి తీసుకున్న ముష్కరులు.. ఆదివారం బిహార్‌కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను చంపేశారు. మరొకరిని గాయపర్చారు. కుల్గాంలోని వాన్‌పోహ్‌ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. కూలీలు అద్దెకు ఉంటున్న గదిలోకి చొరబడి మరీ ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల సంఖ్య 11కు చేరింది. ఇందులో ఐదుగురు ఇతర రాష్ట్రాలవారు. స్థానికేతరులపై ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతుండడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. కశ్మీర్‌ లోయలో ఉన్న అందరు వలస కూలీలను తక్షణం సమీపంలోని భద్రత దళాల స్థావరాలకు చేర్చాలని ఐజీ విజయ్‌ కుమార్‌ అన్ని జిల్లాల పోలీసు విభాగాలకు అత్యవసర సందేశాలు పంపారు. ఇదిలా ఉండగా పౌరులపై వరుస దాడులు జరుగుతుండడంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. పీడీపీ, సీపీఎం ఈ ఘటనను ఖండించాయి. అంతకు ముందు జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా రేడియోలో మాట్లాడుతూ ఉగ్రదాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను వేటాడుతామని ప్రకటించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన