జమ్మూ-కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా?
close

ప్రధానాంశాలు

Updated : 20/06/2021 12:22 IST

జమ్మూ-కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా?

24న ప్రధాని ఆధ్వర్యంలో అఖిల పక్ష భేటీ

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కనుందా? కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఈ దిశగా సన్నాహాలు ప్రారంభమయినట్టు అనిపిస్తోందని విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24న జమ్మూ-కశ్మీర్‌కు చెందిన అన్ని పార్టీల నాయకులతో సమావేశం కానున్నారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర నాయకులు పాల్గొననున్నారు. ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన 370వ అధికరణం రద్దు తరువాత జరిగే తొలి భేటీ ఇదే కానుండడం గమనార్హం. రానున్న నవంబరులోగానీ, వచ్చే ఏడాదిలోగానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సూచనలు ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణతో పాటు, ఇతర సమస్యలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

14 మంది నాయకులకు ఆహ్వానం

ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆ రాష్ట్రానికి చెందిన 14 మంది నాయకులను ఆహ్వానించారు. ఇందులో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, నలుగురు మాజీ ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఆహ్వానం అందుకున్నవారిలో మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), గులాం నబీ ఆజాద్‌ (కాంగ్రెస్‌), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్‌ (కాంగ్రెస్‌), ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ (పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌), నిర్మల్‌ సింగ్, కవీందర్‌ గుప్తా (భాజపా)లకు ఆహ్వానాలు అందాయి. వీరు కాకుండా మహమ్మద్‌ యూసఫ్‌ తరిగామి (సీపీఎం), అల్తాఫ్‌ బుఖారీ (జే-కే అప్నీ పార్టీ), జి.ఎ.మీర్‌ (కాంగ్రెస్‌), రవీందర్‌ రైనా (భాజపా), భీం సింగ్‌ (పాంథర్స్‌ పార్టీ), సజ్జాద్‌ లోనే (పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌) కూడా సమాచారం అందింది. ఈ విషయమై చర్చించడానికి ఆదివారం మెహబూబా ముఫ్తీ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్, జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధిపతి అరవింద్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 370 అధికరణాన్ని రద్దు చేసి రెండేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఆ కేంద్రపాలిత డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ అక్కడి పరిస్థితులను గంట సేపు వివరించారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, అయినప్పటికీ ఏమరపాటు ఉండకూడదని అన్నారు. 

నిర్బంధం నుంచి మదానీ విడుదల

పీడీపీ సీనియర్‌ నాయకుడు సత్రాజ్‌ మదానీ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అఖిల పక్ష సమావేశం విషయమై పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి కేంద్రం నుంచి సమాచారం అందిన కొద్ది గంటల్లోనే ఇది జరగడం గమనార్హం. ఆయన గత ఆరు నెలలుగా ఎమ్మెల్యే హాస్టల్‌లో నిర్బంధంలో ఉన్నారు. మెహబూబాకు మదానీ మేనమామ అవుతారు. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన