కర్ణాటక మంత్రి ఇంటికే టీకా

ప్రధానాంశాలు

Updated : 03/03/2021 07:41 IST

కర్ణాటక మంత్రి ఇంటికే టీకా

హావేరి, న్యూస్‌టుడే: సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసుపత్రికి వెళ్లి కరోనా టీకా వేయించుకోగా.. కర్ణాటక వ్యవసాయ మంత్రి బి.సి.పాటిల్‌ మాత్రం వైద్య సిబ్బందిని తన ఇంటికే పిలిపించారు. ఆపై తాను, భార్య, ఇతర కుటుంబీకులు టీకాలను వేయించుకున్నారు. ఈ అంశం తీవ్ర దుమారానికి కారణమైంది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో జిల్లాలోని హీరేకెరూరు తాలూకా వైద్యాధికారి మకాందార్‌కు ఉన్నతాధికారులు నోటీసు జారీ చేశారు. విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికీ వెళ్లడంతో వివరణ కోరినట్లు సమాచారం. ‘విషయం ఇంత వివాదంగా మారుతుందని అనుకోలేదు. లేదంటే.. నేనే ఆసుపత్రికి వెళ్లేవాడిని’ అంటూ పాటిల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన