కుమారుడు కేంద్ర మంత్రయినా.. కూలి పనులకే

ప్రధానాంశాలు

Updated : 20/07/2021 12:24 IST

కుమారుడు కేంద్ర మంత్రయినా.. కూలి పనులకే

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తనయుడు కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కూలి పనులకు వెళ్తున్నారు ఆయన తల్లిదండ్రులు. భాజపా నేత, కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ స్వగ్రామం తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా పరమత్తి సమీపంలోని కోనూరు. ఆయన తండ్రి లోకనాథన్‌ (65), తల్లి వరదమ్మాల్‌ (60). వీరు మొదటి నుంచి వ్యయసాయ కూలీలు. వీరి కుమారులు మురుగన్‌, రామస్వామి. తమ రెక్కల కష్టంతోనే కుమారులను చదివించారు. చిన్న వయసు నుంచే చదువుపై ఆసక్తి ఉన్న మురుగన్‌ న్యాయవిద్య, ఎంఎల్‌, పీహెచ్‌డీ పూర్తి చేశాక భాజపాలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇటీవలే కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగారు. ఇవేవీ పట్టించుకోకుండా ఆయన తల్లిదండ్రులు తమ పనిని కొనసాగిస్తున్నారు. మురుగన్‌ సతీమణి కలైయరసి చెన్నైలో పిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు. దీనిపై లోకనాథన్‌ దంపతులు స్పందిస్తూ.. తనతో కలిసి ఉండాలని, కుమారుడు రమ్మని పిలిచారన్నారు.. కానీ సొంత కష్టంతోనే బతకాలని నిర్ణయించుకుని తాము పనులకు వెళ్తున్నామని వివరించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన