అజాగ్రత్త వహిస్తే మూడో ముప్పు!
close

ప్రధానాంశాలు

Updated : 20/06/2021 11:26 IST

అజాగ్రత్త వహిస్తే మూడో ముప్పు!

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా 

దిల్లీ: కరోనా నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం వహించడంతో పాటు గుంపులు గుంపులుగా ప్రజలు గుమికూడితే వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందటానికి ఎంతో సమయం పట్టదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. 6 నుంచి 8 వారాల్లోనే మూడో అల ముంచుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జనాభాలో అధిక సంఖ్యాకులకు టీకా అందే వరకూ కొవిడ్‌ వ్యాప్తి నిరోధక విధానాలను పాటించాలని సూచించారు. కొత్తగా నమోదయ్యే కరోనా కేసులను ఓ కంట కనిపెడుతూ ఉండాలని, ఏదైనా ప్రాంతంలో పరీక్షించిన నమూనాల్లో పాజిటివ్‌ కేసులు 5శాతాన్ని మించితే స్థానికంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలన్నారు. మూడో ఉద్ధృతిలో చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని చెప్పేందుకు ప్రస్తుతం ఆధారాల్లేవని శనివారం ఆయన ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశంలో సెప్టెంబరు-అక్టోబరు మధ్య మూడోసారి కరోనా చెలరేగే అవకాశం ఉందని అంటువ్యాధుల నిపుణులు గతంలో అంచనా వేశారు. ఏప్రిల్‌-మే నెలల్లో రెండో దశ ఉద్ధృతి కొనసాగి ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నిబంధనలను పాటించాలని గులేరియా సూచించారు.


 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన