close

తాజావార్తలు

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కేపీ రోడ్‌లో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో పోలీసు అధికారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య భారీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమర్చేందుకు భద్రతా బలగాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి.

ఎప్పుడూ రద్దీగా ఉండే అనంతనాగ్ కేపీ రోడ్డులో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో గుర్తు తెలియని మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గాయాలపాలైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు గ్రనేడ్లు కూడా విసిరినట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.