Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009344
            [news_title_telugu_html] => 

ఐరాసలో పారని పాక్‌ పాచిక..

[news_title_telugu] => ఐరాసలో పారని పాక్‌ పాచిక.. [news_title_english] => UN opposes Pakistans mediation demand says India Pak must resolve Kashmir through talks [news_short_description] => జమ్మూకశ్మీర్‌ అంశంలో ఐక్యరాజ్యసమితి నుంచి పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐరాస మధ్యవర్తిత్వం వహిస్తుందని అనుకున్న ఆ దేశానికి యూఎన్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ చేసిన వ్యాఖ్యలతో దిమ్మ తిరిగినట్లైంది. కశ్మీర్‌ అంశంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ మాట్లాడుతూ [news_tags_keywords] => united nations,antonio guteras,stephane dujaric,jammu kashmir,india pak [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 00:17:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఐరాసలో పారని పాక్‌ పాచిక.. - UN opposes Pakistans mediation demand says India Pak must resolve Kashmir through talks - EENADU
close

తాజావార్తలు

ఐరాసలో పారని పాక్‌ పాచిక..

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూకశ్మీర్‌ అంశంలో ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐరాస మధ్యవర్తిత్వం వహిస్తుందని ఆశించిన ఆ దేశానికి యూఎన్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ చేసిన వ్యాఖ్యలతో దిమ్మ తిరిగినట్లైంది. కశ్మీర్‌ అంశంపై మాట్లాడిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌  ‘ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము. ఇది భారత్‌, పాక్‌లే ద్వైపాక్షికంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి’ అని అన్నారని డుజరిక్‌ మీడియాతో వెల్లడించారు. 

అదేవిధంగా డుజరిక్‌ మాట్లాడుతూ.. ‘గతనెలలో ఫ్రాన్స్‌ బియారిట్జ్‌లో నిర్వహించిన జీ7 సదస్సులో భాగంగా గుటెరస్‌ కశ్మీర్‌ అంశంపై భారత ప్రధాని నరేంద్రమోదీతోనూ, పాక్‌ విదేశాంగ మంత్రి షామహ్మద్‌ ఖురేషీతోనూ మాట్లాడారు. అంతేకాకుండా యూఎన్‌లో పాకిస్థాన్‌ ప్రతినిధి మలీహ లోధి వినతి మేరకు కశ్మీర్‌ అంశంపై గుటెరస్‌ ఆమెతో కూడా సమావేశమయ్యారు. అయినప్పటికీ ఈ అంశంపై ఎట్టి పరిస్థితిలోనూ తాము జోక్యం చేసుకోమని గుటెరస్‌ వెల్లడించారు. రెండు దేశాల నుంచి మధ్యవర్తిత్వం కోరితే మేము అందించడానికి సిద్ధమే అన్నారు. కానీ భారత్‌ ఇప్పటికే కశ్మీర్‌ తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజం ముందు తేల్చి చెప్పిందని అన్నారని’ డుజరిక్‌ వెల్లడించారు. 

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్‌ భారత్‌పై తన అక్కసు వెల్లగక్కుతోంది. మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఈ క్రమంలో యూఎన్‌ ఈ విషయంపై స్పందిస్తూ అది రెండు దేశాల ద్వైపాక్షిక విషయమే అనడం గమనార్హం. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.