Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009700
            [news_title_telugu_html] => 

వివాహ వేదికగా మారిన ‘అమ్మ’ సమాధి

[news_title_telugu] => వివాహ వేదికగా మారిన ‘అమ్మ’ సమాధి [news_title_english] => jayalalitha cremation Turns it Into Wedding Venue for AIADMK leader son [news_short_description] => తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంటే ఆ రాష్ట్ర ప్రజలకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మీద అభిమానంతో...... [news_tags_keywords] => Jayalalitha,Tamilnadu,AIADMK [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 09:53:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వివాహ వేదికగా మారిన ‘అమ్మ’ సమాధి - jayalalitha cremation Turns it Into Wedding Venue for AIADMK leader son - EENADU
close

తాజావార్తలు

వివాహ వేదికగా మారిన ‘అమ్మ’ సమాధి

జయలలిత స్మారకం వద్ద కుమారుడి వివాహం జరిపించిన ఏఐఏడీఎంకే నేత

చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంటే ఆ రాష్ట్ర ప్రజలకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మీద అభిమానంతో గుడిసైతం కట్టించిన విషయం తెలిసిందే. ఆమె కూడా అంతే..ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు. అందుకే తమిళనాట ప్రజలు జయలలితను ‘అమ్మ’ అని పిలుచుకుంటారు. ఆమె ఈలోకాన్ని వీడి మూడేళ్లయినా వారిలో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నారు. ‘అమ్మ’ మీదున్న అభిమానాన్ని అన్నాడీఎంకే నేత ఒకరు వినూత్నంగా చాటుకున్నారు. ఆమె పట్ల తమకున్న భక్తిని చాటారు. 

ఏఐఏడీఎంకే నేత ఎస్‌ భవానీ శంకర్‌..తన కుమారుడు ఎస్పీ సాంబశివరామన్‌-దీపికల వివాహాన్ని జయలలిత స్మారకం వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. తమిళనాడు సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వైభవంగా జరిగింది. ‘అమ్మ’ సమాధి ఎదురుగా వధూవరులు ఒక్కటయ్యారు. జయలలిత ఆశీస్సుల కోసమే ఇక్కడ వివాహం జరిపించినట్లు భవానీ శంకర్‌ తెలిపారు. ఈ వివాహానికి ఏఐఏడీఎంకే నేతలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకుని జయలలిత సమాధిని పూలతో అందంగా అలంకరించారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.