ఈ విజయం మధుర జ్ఞాపకం..!
close

కథనాలు

Updated : 29/12/2020 12:01 IST

ఈ విజయం మధుర జ్ఞాపకం..!

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా ఎట్టకేలకు 2020లో తొలి టెస్టు విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్‌ ఆ తర్వాత 9 నెలలు టెస్టులే ఆడలేదు. ఐపీఎల్‌ తర్వాత ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన భారత్‌ ఇటీవల అడిలైడ్‌ టెస్టులోనూ ఘోర పరాభవం పాలైంది. ఆ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆధిపత్యంలో నిలిచినా మూడో రోజు అనూహ్యంగా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 36/9 స్కోర్‌ సాధించి టెస్టు చరిత్రలో అవమానకరమైన రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో విజయం సాధించి ఆస్ట్రేలియాకు దీటుగా బదులివ్వడమే కాకుండా ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకుంది.

ఆస్ట్రేలియాపై గెలుపు.. ఆసక్తికర విశేషాలు..

* విదేశాల్లో భారత్‌కిది 52వ టెస్టు విజయం. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో ఆడిన 50 టెస్టుల్లో ఇది ఎనిమిదో విజయం. మొత్తంగా కంగారూలపై ఆడిన 100 మ్యాచ్‌ల్లో 29వ గెలుపు


* విదేశాల్లో మెల్‌బోర్న్‌లోనే భారత్‌ అత్యధికంగా 4 టెస్టుల్లో విజయం సాధించింది. ఇంతకుముందు 1978, 1981, 2018లో భారత్‌ ఈ మైదానంలో గెలుపొందింది. ఆ తర్వాత పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, కింగ్‌స్టన్‌, కొలంబో మైదానాల్లో మూడు విజయాలు సాధించింది.


* ఇక 1996 నుంచి జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మొత్తం 50 టెస్టులు జరగ్గా భారత్‌ 21 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఆస్ట్రేలియా 19 గెలవగా 10 టెస్టులు డ్రా అయ్యాయి.


* గత పదేళ్లలో భారత్‌ 3 బాక్సింగ్‌ డే టెస్టులు ఆడగా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2010లో తొలిసారి ధోనీ సారథ్యంలో డర్బన్‌లో 87 పరుగులతో దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత్‌ తర్వాత రహానె నేతృత్వంలో ఈరోజు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 


* ఈ శతాబ్దంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో 22 టెస్టులు ఆడగా 5 మ్యాచ్‌లు గెలుపొందింది. అలాగే ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో 21 టెస్టులు ఆడగా 4 గెలిచింది.


* ఈ మ్యాచ్‌లో రహానె విన్నింగ్‌ షాట్‌ కొట్టడం ద్వారా టెస్టు కెరీర్‌లో తొలిసారి ఆ ఘనత సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాలో విన్నింగ్‌ రన్స్‌ సాధించిన ఆటగాడు దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాహుల్ ద్రవిడ్‌.


* టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌ చరిత్రలో కనీసం 100 వికెట్లు తీసిన వారిలో రవీంద్ర జడేజాకు మించిన అత్యుత్తమ బౌలింగ్‌ సగటు 24.48 ఎవరికీ లేదు. ఈ మ్యాచ్‌లో అతడు 3 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.


* ఆస్ట్రేలియా 100 ఓవర్లలో 200 పరుగుల స్కోర్‌ సాధించకపోవడం ఈ శతాబ్దంలో ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 100 ఓవర్లకు 196/9తో నిలిచింది. చివరికి 103 ఓవర్లలో 200 పరుగులు చేరుకుంది.

ఇవీ చదవండి..

రెండో టెస్టులో విజయం మనదే
విరాట్‌కు పోటీయా! వార్నర్ ప్రశంసలివి
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన