Lakshdweep: లక్షద్వీప్‌లో మాల్దీవుల తరహా నీటి విల్లాలు

ప్రధానాంశాలు

Updated : 02/08/2021 11:15 IST

Lakshdweep: లక్షద్వీప్‌లో మాల్దీవుల తరహా నీటి విల్లాలు

రూ.800 కోట్ల వ్యయంతో  ఏర్పాటుకు టెండర్లు

కవరత్తి: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీప్‌లో త్వరలోనే మరో ప్రత్యేక ఆకర్షణ రానుంది. మాల్దీవుల తరహాలో విలాసవంతమైన నీటి విల్లాలు ఇక్కడ ఏర్పాటుకానున్నాయి. దేశంలోనే తొలిసారిగా రూ.800 కోట్ల వ్యయంతో లక్షద్వీప్‌లోని మినీకాయ్, కద్‌మత్, సుహేలీ దీవుల్లో మూడు నీటి విల్లా ప్రాజెక్టులు నిర్మించాలని అక్కడి పాలన యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం గ్లోబల్‌ టెండర్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. సముద్రతీర ప్రాంత ఆర్థిక వృద్ధికి బలమైన పర్యాటక వనరును సమకూర్చాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపింది. పగడాల దీవుల్లోని పర్యావరణ వ్యవస్థను సంరక్షిస్తూనే, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కూడా ఈ ప్రాజెక్టు ఉద్దేశమని చెప్పింది. ఈ ప్రతిపాదనలకు ఆయా దీవుల్లోని స్థానిక పంచాయతీలు కూడా సమ్మతించి, నిరభ్యంతర పత్రాలు ఇచ్చాయని వివరించింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన