close

కథనాలు

Updated : 03/04/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీకి షాక్‌: అక్షర్‌ పటేల్‌కు కరోనా

అధికారికంగా ధ్రువీకరించిన దిల్లీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ ఆరంభానికి ముందు దిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టు కీలక ఆటగాళ్లలో ఒకరైన అక్షర్‌ పటేల్‌కు కరోనా వైరస్‌ సోకిందని సమాచారం. దాంతో నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది.

‘దురదృష్టవశాత్తు అక్షర్‌కు పాజిటివ్‌ వచ్చింది. అతడు ఏకాంతంలో ఉన్నాడు. కరోనా నిబంధనలు, ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నాం’ అని దిల్లీ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మార్చి 28న అతడు నెగెటివ్‌ రిపోర్డుతో శిబిరంలో అడుగుపెట్టాడు. రెండోసారి చేసిన ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలింది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో దిల్లీ తొలి మ్యాచులో తలపడాల్సి ఉంది. అక్షర్‌ కన్నా ముందు కోల్‌కతా ఆటగాడు నితీశ్‌ రాణా కొవిడ్‌ బారిన పడ్డాడు. మార్చి 22న పాజిటివ్‌ రాగా గురువారం మళ్లీ నెగెటివ్‌ వచ్చింది.

ఎవరైనా ఆటగాళ్లకు పాజిటివ్‌ వస్తే బీసీసీఐ నిబంధనల ప్రకారం వారిని బయోబుడగ నుంచి వేరుచేయాలి. 10 రోజులు ప్రత్యేక ఏకాంత వాసానికి పంపించాలి. రోజూ జట్టు వైద్యులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు బాధితులు ఎలాంటి శారీరక కసరత్తులు చేయడానికి వీల్లేదు. వాంఖడే మైదానం సిబ్బందీ కరోనా వైరస్‌ బారిన పడుతుండటంతో పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్టు కనిపించడం లేదు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన