close

కథనాలు

Updated : 10/04/2021 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నై సూపర్‌కింగ్స్‌లో ఒక మార్పు

ముంబయి: చెన్నై సూపర్‌కింగ్స్‌లో ఒక మార్పు జరిగింది. ఆస్ట్రేలియా పేసర్‌ జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌తో ఆ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమైన హేజిల్‌వుడ్‌ స్థానంలో అతడిని తీసుకుంది. ఈ మేరకు లీగ్‌ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు.

బెరెన్‌డార్ఫ్‌కు ఇది రెండో ఐపీఎల్‌.  2019లో అతడు ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడాడు. ఐదు మ్యాచులాడి ఐదు వికెట్లు తీశాడు. ఆసీస్‌ తరఫున 11 వన్డేలు, 7 టీ20లు ఆడిన అనుభవం అతడి సొంతం. గత సీజన్లో హేజిల్‌వుడ్‌ చెన్నైకి 3 మ్యాచులు ఆడాడు. యాషెస్‌ సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌నకు తాజాగా ఉండేందుకు ఐపీఎల్‌కు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టోర్నీ నుంచి వైదొలిగాడు. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై మొదటి మ్యాచ్‌ ఆడనుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన