IPL 2021: మిగతా సీజన్‌కి కూడా రిషభ్‌ పంతే కెప్టెన్‌.!

ప్రధానాంశాలు

Published : 16/09/2021 21:09 IST

IPL 2021: మిగతా సీజన్‌కి కూడా రిషభ్‌ పంతే కెప్టెన్‌.!

దుబాయి: త్వరలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్‌ మలి అంచెలో కూడా దిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టుకు రిషభ్‌ పంతే కెప్టెన్‌గా కొనసాగుతాడని ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. భుజం గాయం కారణంగా డీసీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌కి దూరం కావడంతో.. పంత్‌కి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అయ్యర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ జట్టులోకి రావడంతో మళ్లీ అతడికే దిల్లీ పగ్గాలప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. మిగతా సీజన్‌కి కూడా పంతే జట్టుని నడిపిస్తాడని పేర్కొంది.

కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్.. సెప్టెంబర్‌ 19 నుంచి పునః ప్రారంభం కానుంది. కాగా, పాయింట్ల పట్టికలో దిల్లీ క్యాపిటల్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో ఆరింట్లో నెగ్గిన దిల్లీ.. 12 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన