close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒలింపిక్స్‌కు అన్షు, సోనమ్‌

సాక్షికి మూసుకుపోయిన దారులు

అల్మటి (కజకిస్థాన్‌): భారత టీనేజీ మహిళా రెజ్లింగ్‌ సంచలనాలు అన్షు మలిక్‌, సోనమ్‌ మలిక్‌ చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్సు భారత మహిళా రెజ్లర్‌గా 18 ఏళ్ల సోనమ్‌ రికార్డు నమోదు చేసింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో తమ తమ విభాగాల్లో ఫైనల్‌ చేరడం ద్వారా ఈ హరియాణా రెజ్లర్లు టోక్యో విమానం ఎక్కే అవకాశం కొట్టేశారు. మహిళల 62 కేజీల సెమీస్‌లో గాయమైనప్పటికీ అద్వితీయంగా పోరాడిన సోనమ్‌ గొప్ప విజయం సాధించింది. స్థానిక రెజ్లర్‌ కస్సిమోవాతో పోరు ఆరంభమైన కొద్దిసేపటికే ప్రత్యర్థి పట్టిన పట్టుకు కుడి మోకాలికి గాయమై నిలబడలేని పరిస్థితుల్లో ఆమె విలవిలలాడింది. అప్పటికే తను 0-6తో వెనకబడింది. ఆ పరిస్థితుల్లో తను పోటీపడలేదని, ఒలింపిక్స్‌ బెర్త్‌ ఇక అందదని అందరూ అనుకున్నారు. కానీ సంకల్ప బలంతో పోరులో నిలిచిన ఆమె.. అద్భుతమే చేసింది. గాయాన్ని లెక్కచేయకుండా వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి విజేతగా నిలిచింది. ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించింది. గాయంతో ఫైనల్‌కు దూరమై రజతం దక్కించుకుంది. ఒలింపిక్స్‌కు సోనమ్‌ అర్హత సాధించడంతో అదే విభాగంలో పోటీపడే 2016 రియో ఒలింపిక్స్‌ కాంస్య విజేత సాక్షి మలిక్‌ ఆశలకు తెరపడింది. మరోవైపు 19 ఏళ్ల అన్షు.. మహిళల 57 కేజీల విభాగంలో రజతం గెలిచింది. పసిడి పోరులో ఆమె 4-7 తేడాతో ఖొంగోర్జుల్‌ (మంగోలియా) చేతిలో ఓడింది. ఇప్పటికే మహిళల్లో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), పురుషుల్లో బజ్‌రంగ్‌ (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), దీపక్‌ పునియా (86 కేజీలు) ఒలింపిక్స్‌ అర్హత సాధించారు. మరోవైపు ఈ టోర్నీలో నిశా దహియా (68 కేజీల) కాంస్యం గెలిచింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన