close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజ్ఞానందకు టైటిల్‌

చెన్నై: భారత 15 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మరోసారి అంతర్జాతీయ టోర్నీలో మెరిశాడు. జులియస్‌ బార్‌ ఛాలెంజర్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న పొల్గార్‌ ఛాలెంజ్‌ టోర్నీలో ఆదివారం అతను విజేతగా నిలిచాడు. టోర్నీలో మరో రౌండు మిగిలే ఉన్నప్పటికీ తొలి మూడు రౌండ్లలో విజయాలు సాధించిన ప్రజ్ఞానందను టైటిల్‌ వరించింది. ఈ విజయంతో సుమారు రూ.2.24 లక్షల నగదు బహుమతి సొంతం చేసుకోవడంతో పాటు అత్యుత్తమ ప్లేయర్లు తలపడే మెల్ట్‌వాటర్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌కు అతను అర్హత సాధించాడు. ఈ నెల 24న ఆ టోర్నీ జరగనుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన