close

ప్రధానాంశాలు

Published : 17/04/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాక్‌దే టీ20 సిరీస్‌

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న పాకిస్థాన్‌.. టీ20 సిరీస్‌నూ కైవసం చేసుకుంది. నాలుగు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌ను 3 వికెట్లతో నెగ్గిన పాక్‌ సిరీస్‌ను 3-1తో నెగ్గింది. శుక్రవారం ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదట 19.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. వాండర్‌ డుసెన్‌ (52), మలన్‌ (33) మినహా అంతా విఫలమయ్యారు. లక్ష్యాన్ని పాక్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫకార్‌ జమాన్‌ (60; 34 బంతుల్లో 5×4, 4×6) రాణించాడు. వన్డే సిరీస్‌ను పాక్‌ 2-1తో నెగ్గిన సంగతి తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన