close

ప్రధానాంశాలు

Published : 21/04/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెమీస్‌లో మరో ఏడుగురు భారతీయులు

దిల్లీ: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మరో ఏడుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బేబీరోజిసినా చాను (51 కేజీ), అరుంధతి చౌదరి (69కేజీ), సనమాచ చాను (75కేజీ), అంకిత్‌ నర్వాల్‌ (64కేజీ), విశాల్‌ గుప్తా (91కేజీ), విశ్వామిత్ర చొంగ్తామ్‌ (49 కేజీ), సచిన్‌ (56కేజీ) క్వార్టర్స్‌లో నెగ్గి పతకాలు ఖాయం చేసుకున్నారు. మహిళల క్వార్టర్స్‌లో బీబీరోజిసినా చాను 5-0తో కుబికా (పోలెండ్‌)పై, అరుంధతి 5-0తో అనా సెజ్కో (ఉక్రెయిన్‌)పై నెగ్గారు. సనమాచ చాను.. రష్యా అమ్మాయి జువాను ఓడించింది. పురుషుల క్వార్టర్స్‌లో విశ్వామిత్ర, అంకిత్‌ నర్వాల్‌లు 5-0తో తమ తమ ప్రత్యర్థులు ఒమర్‌ అమెతోవిచ్‌ (సెర్బియా), జెకీల్‌ ద క్రజ్‌ (బ్రెజిల్‌)పై విజయం సాధించారు. ఇంతకుముందే నలుగురు భారత బాక్సర్లు సెమీస్‌లో అడుగుపెట్టారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన