మహమ్మారిపై పోరులో..
close

ప్రధానాంశాలు

Published : 12/05/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహమ్మారిపై పోరులో..

దిల్లీ: కరోనాపై పోరుకు అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సహా అయిదుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు చేతులు కలిపారు. సహాయ చర్యలకు నిధులు సేకరించేందుకు వీళ్లు గురువారం ఆన్‌లైన్‌లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఫిడే రేటింగ్‌లో 2000లోపు ఉన్న ఆటగాళ్లెవరైనా 150 డాలర్ల విరాళం ఇవ్వడం ద్వారా ఆనంద్‌తో పోటీపడొచ్చు. మిగతా నలుగురితో పోటీపడాలంటే 25 డాలర్ల విరాళమిచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల సందర్భంగానూ విరాళాలను స్వీకరిస్తారు. గురువారం రాత్రి 7.30కి ఆరంభమయ్యే మ్యాచ్‌లను చెస్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ ప్రసారం చేస్తుంది. వచ్చిన విరాళాలకు సమానంగా (10 వేల డాలర్ల వరకు) తామూ విరాళమిస్తామని వెబ్‌సైట్‌ పేర్కొంది. ఆనంద్‌తో పాటు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, నిహాల్‌ సరీన్‌, ప్రజ్ఞానంద  ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన