ఐపీఎల్‌పై ఇంగ్లిష్‌ బాంబు
close

ప్రధానాంశాలు

Published : 12/05/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఎల్‌పై ఇంగ్లిష్‌ బాంబు

మిగతా మ్యాచ్‌లకు తమ ఆటగాళ్లు కష్టమేనన్న ఈసీబీ

లండన్‌: అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ను తిరిగి ఎప్పుడు మొదలుపెడతాం, ఎక్కడ జరిపిద్దాం అని బీసీసీఐ చూస్తుంటే.. మ్యాచ్‌లు ఎప్పుడు జరిగినా తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం కష్టమే అంటూ బాంబు పేల్చింది ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు. జూన్‌ నుంచి ఇంగ్లాండ్‌ క్రికెటర్లు తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం సందేహమే అని ఈసీబీ చెప్పింది. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ ముగిశాక, సెప్టెంబరు ద్వితీయార్ధం నుంచి.. లేదా నవంబరులో టీ20 ప్రపంచకప్‌ ముగిశాక ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ అయ్యాక ఆ దేశంలోనే ఐపీఎల్‌ నిర్వహించడంపైనా దృష్టిసారిస్తోంది. కానీ భారత్‌తో సిరీస్‌ ముగిశాక, అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్‌ జట్టు.. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల్లో పర్యటించాల్సి ఉంది. ప్రపంచకప్‌ అయ్యాక ఆ జట్టు ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌లో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని ఈసీబీ అంటోంది. స్టోక్స్‌, బట్లర్‌ లాంటి స్టార్లు సహా ఈసారి ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంఛైజీలకు 11 మంది ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. వీళ్లు అందుబాటులో లేకుంటే ఆయా ఫ్రాంఛైజీలకు ఇబ్బందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన