నా కెరీర్‌ విరాట్‌ పుణ్యం
close

ప్రధానాంశాలు

Published : 12/05/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కెరీర్‌ విరాట్‌ పుణ్యం

అతనిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది

హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌

ముంబయి

తాను కెరీర్లో ఇప్పుడున్న స్థాయిలో ఉండటానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే కారణమని హైదరాబాదీ యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. కష్టకాలంలో కోహ్లి ఇచ్చిన భరోసాను, ప్రోత్సాహాన్ని తాను ఎప్పటికీ మరువలేనని అతను చెప్పాడు. గత ఏడాది చివర్లో సిరాజ్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. అతడి తండ్రి చనిపోవడం, క్వారంటైన్‌ నిబంధనల కారణంగా అతను అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోవడం తెలిసిందే. ఆ బాధాకర పరిస్థితుల్లో కోహ్లి తనకు గొప్ప అండనిచ్చినట్లు సిరాజ్‌ చెప్పాడు. ఆ పర్యటనలోనే టెస్టు అరంగేట్రం చేసే అవకాశం అందుకున్న సిరాజ్‌.. 3 టెస్టుల్లో 13 వికెట్లతో జట్టు 2-1తో సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనకు పరోక్షంగా విరాటే కారణమని సిరాజ్‌ అన్నాడు. ‘‘కోహ్లి నాతో ఎప్పుడూ ఒకే మాట అంటుంటాడు. ‘ఏ పిచ్‌ మీదైనా రాణించే, ఎలాంటి బ్యాట్స్‌మన్‌నైనా ఔట్‌ చేసే సామర్థ్యం నీ దగ్గర ఉంది’ అని. నా బౌలింగ్‌ను మార్చుకున్న తీరునూ అభినందిస్తూ, అది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతోందని, ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రశంసలు దక్కడం ఎంతగానో స్ఫూర్తినిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పుడు కోహ్లీనే నాకు ధైర్యం చెప్పాడు. హోటల్‌ గదిలో ఏడుస్తూ ఉంటే నా దగ్గరికొచ్చి గట్టిగా హత్తుకుని, ‘నీకు నేనున్నా. బాధ పడకు’ అని భరోసా ఇవ్వడం నాకింగా గుర్తుంది. కోహ్లి ఆ సిరీస్‌లో ఆడింది ఒక్క టెస్టే. కానీ తన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. మిగతా మూడు టెస్టుల్లో నాకు అవకాశం లభించగానే సత్తా చాటాను. గత రెండేళ్లూ నేను బెంగళూరు జట్టుతోనే ఉండటానికి సరైన కారణాలు కనిపించవు. కానీ విరాట్‌ నాకు మద్దతునిచ్చి ప్రోత్సహించాడు. అన్ని రకాల సమయాల్లోనూ అతను నాకు అండగా నిలిచాడు. నా ఈ కెరీర్‌ విరాట్‌ పుణ్యమే’’ అని సిరాజ్‌ అన్నాడు. టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి సైతం తనను ఎంతగానో ప్రోత్సహిస్తాడని సిరాజ్‌ చెప్పాడు. ‘‘నేనొక ఛాంపియన్‌ బౌలర్‌ అని రవి సర్‌ అంటుంటాడు. ఎప్పుడూ నా వెన్ను తట్టి మాట్లాడుతుంటాడు. ప్రాక్టీస్‌ సెషన్లలో నాకెంతగానో సాయం చేశాడు. ఈ వయసులోనూ ఆయన ఉత్సాహం అసాధారణం’’ అని అతనన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన